తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా తిరుమ శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది.

Update: 2024-02-08 04:47 GMT

దిశ, ఫీచర్స్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా తిరుమ శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు కుటుంబ సమేతంగా వెళ్లి తమ మొక్కులు చెల్లించుకుని వెళ్తారు. అయితే నేడు తిరుమలలో రద్దీ సాధారణం ఉన్నట్లు సమాచారం.

3 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారని తెలుస్తోంది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి కేవలం 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో చాలా మంది తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న స్వామి వారిని 65, 683 మంది దర్శించుకున్నారు. అలాగే హుండీ ఆదాయం రూ. 3. 59 కోట్లు వచ్చినట్లు సమాచారం.


Similar News