అక్షయ తృతీయ నాడు ఏ వస్తువులు కొనకూడదో తెలుసా.. ?
హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు వస్తుంది. మతపరమైన, పౌరాణిక విశ్వాసాల ప్రకారం, అక్షయ తృతీయ రోజున, వివాహం, నిశ్చితార్థం, గృహ ప్రవేశంతో సహా అన్ని రకాల శుభకార్యాలను ఎటువంటి శుభ సమయం లేకుండా చేయవచ్చు. సత్యయుగం, త్రేతాయుగం అక్షయ తృతీయ నుండి ప్రారంభమైందని నమ్ముతారు. ద్వాపర యుగం ఈ రోజుతో ముగిసింది. ఆ తర్వాత కలియుగం కూడా అక్షయ తృతీయ నుండి ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయను యుగాది తిథి అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని పెద్దఎత్తున కొనుగోలు చేయాలని నమ్మకం. ఈ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక గల కారణాలు, మత విశ్వాసాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయ 2024 లో ఎప్పుడు ?
ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం, 10 మే 2024న వస్తుంది. ఈ రోజున ఏ శుభ ముహూర్తాన్ని చూడకుండానే శుభకార్యాలను చేయవచ్చు.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం ఎందుకు శ్రేయస్కరం ?
అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు బంగారం, వెండి కొంటారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని కూడా చెబుతారు.
ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా, మీరు ఏడాది పొడవునా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వల్ల సంపద, కీర్తి, పెరుగుతుందని చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున, కుబేరుడు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున కుబేరుడు నిధిని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, మట్టి పాత్రలు, ఇత్తడి లేదా రాగి పాత్రలు మొదలైన వాటిని కొనుగోలు చేయవచ్చంటున్నారు. అంతేకాదు అక్షయ తృతీయకు బంగారం కొనలేకపోతే ఈ పవిత్రమైన రోజున మీరు బీన్స్, బియ్యం, గోధుమ పిండి, ముఖ్యంగా నెయ్యి కొనుగోలు చేయడం మంచిదట.
అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు..
అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్, ఇనుము మొదలైన వాటితో తయారు చేసిన పాత్రలు, వస్తువులను కొనుగోలు చేయకూడదంటున్నారు. ఇలా చేయడం వల్ల రాహువు ప్రభావం ఎక్కువగా ఉండి ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని చెబుతున్నారు పండితులు.