సాక్ష్యాధారాలతో బయటపెట్టాం.. చర్యలేవి?
దిశ, ఏపీ న్యూస్ బ్యూరో: అంబులెన్సుల నిర్వహణలో కుంభకోణం జరిగిందంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆదివారం టీడీపీ నేత పట్టాభిరాం ఆరోపణలు చేయగా.. తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ అంబులెన్సుల నిర్వహణ కుంభకోణంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన ‘తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల నిర్వహణలో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. బాధ్యులైన మీపార్టీ నాయకుల మీద వారి […]
దిశ, ఏపీ న్యూస్ బ్యూరో: అంబులెన్సుల నిర్వహణలో కుంభకోణం జరిగిందంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆదివారం టీడీపీ నేత పట్టాభిరాం ఆరోపణలు చేయగా.. తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ అంబులెన్సుల నిర్వహణ కుంభకోణంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన ‘తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల నిర్వహణలో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. బాధ్యులైన మీపార్టీ నాయకుల మీద వారి బంధువుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి.’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులని కార్యకర్తలని అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల కుంభకోణం 300 కోట్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టాం బాద్యులయిన మీపార్టీ నాయకుల మీద వారి బంధువుల మీద ఏంచర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి @Ysjagan గారు pic.twitter.com/GsFODV4Zxh
— Devineni Uma (@DevineniUma) June 22, 2020