అసమర్థులు మూడు రాజధానులు నిర్మిస్తారా?

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. రాజధాని అమరాతిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని అసమర్థ పాలకులు మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని ఉమ ప్రశ్నించారు. విశాఖలో భూములు అమ్ముకోవడానికే రాజధాని చేస్తున్నారని.. ప్రజల కోసం కాకుండ వారి వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని ఉమ మండిపడ్డారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన హైకోర్టును 32 కేసుల్లో […]

Update: 2020-08-01 05:06 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. రాజధాని అమరాతిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని అసమర్థ పాలకులు మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని ఉమ ప్రశ్నించారు. విశాఖలో భూములు అమ్ముకోవడానికే రాజధాని చేస్తున్నారని.. ప్రజల కోసం కాకుండ వారి వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని ఉమ మండిపడ్డారు.

రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన హైకోర్టును 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ హైకోర్టును ఎలా తరలిస్తారని అన్నారు. రాజధాని అమరావతినే కొనసాగించాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News