యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ దేవాలయమైన వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. ప్రగ‌తి భ‌వ‌న్ లో గురువారం వేముల‌వాడ‌ ఆలయ, ప‌ట్టణాభివృద్ధి ప‌నుల‌పై మంత్రులు కేటీఆర్, ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, […]

Update: 2021-08-19 10:50 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ దేవాలయమైన వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. ప్రగ‌తి భ‌వ‌న్ లో గురువారం వేముల‌వాడ‌ ఆలయ, ప‌ట్టణాభివృద్ధి ప‌నుల‌పై మంత్రులు కేటీఆర్, ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, వీటీడీఏ, దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. వేముల‌వాడ ఆల‌య అభివృద్ధి పనుల పురోగతి, ఇప్పటి వ‌ర‌కు చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులపై మంత్రులు ఆరా తీశారు.

ఈ స‌మావేశంలో మంత్రులు మాట్లాడుతూ యాదాద్రి ఆల‌య తరహాలోనే వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పనులు మొదలుపెట్టామన్నారు. వీటీడీఏ, దేవాదాయ, పుర‌పాల‌క, రోడ్లు భవనాల శాఖ అధికారులు, స్తప‌తిల‌ను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాల‌ని సూచించారు. వేముల‌వాడ ఆల‌య అభివృద్ధితో పాటు స‌మాంత‌రంగా ప‌ట్టణాభివృద్ధి జ‌ర‌గాల‌ని, దానికి సంబంధించిన స‌మ‌గ్ర ప్రణాళిక‌ల‌ను రూపొందించుకుని అన్ని శాఖ‌లు స‌మ‌న్వయంతో ప‌ని చేయాల‌న్నారు. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌తో పాటు పుర ప్రజ‌ల‌కు మెరుగైన సౌక‌ర్యాలు అందించ‌డమే ల‌క్ష్యంగా అధికారులు ప‌ని చేయాల‌న్నారు.

ఆలయ అభివృద్ధిలో భాగంగా పుష్కరిణి, క‌ళ్యాణ‌క‌ట్ట, క‌ళ్యాణ మండ‌పం, క్యూ కాంప్లెక్స్, క‌ళా భ‌వ‌నం పనులను వేగవంతం చేయాల‌ని చెప్పారు. టెంపుల్ టూరిజంలో భాగంగా వేముల‌వాడ‌ను స‌మ‌గ్ర అభివృద్ధి చేయాల‌ని, గుడి చెరువు చుట్టు నెక్లెస్ రోడ్ నిర్మించాల‌ని, బోటింగ్ కు త‌గిన‌ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. వేముల‌వాడ‌, మిడ్ మానేరు లో ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత మెరుగుప‌రిచేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. దీని వ‌ల్ల టెంపుల్ టూరిజం, టూరిజం రెండు అభివృద్ధి చెంద‌డం వ‌ల్ల స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు దొరుకుతాయ‌ని తెలిపారు. అంతేకాకుండా బ‌ద్ధిపోచ‌మ్మ ఆల‌య విస్తర‌ణ ప‌నులు త్వరిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని, దానికి సంబంధించిన స్థల సేక‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని, విస్తర‌ణ‌లో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి త‌గిన న‌ష్టప‌రిహారం చెల్లించాల‌ని పేర్కొన్నారు.

బ‌స్టాండ్ నుంచి ఆల‌యం వ‌ర‌కు ఉచిత ప్రయాణం క‌ల్పించాల‌ని, దానికి అనుగుణంగా మినీ ఎల‌క్ట్రిక‌ల్ బస్సుల‌ను అందుబాటులోకి తెచ్చేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ స‌మావేశంలో వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్నమ‌నేని ర‌మేష్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, దేవాదాయ శాఖ కమిష‌న‌ర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వేముల‌వాడ ఈవో క్రృష్ణ ప్రసాద్, మున్సిప‌ల్ చైర్ ప‌ర్సన్ రామ‌తీర్థపు మాధ‌వీ రాజు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News