ప్రపంచ జీడీపీ వృద్ధి వేగం

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని నెలలుగా ఊహించిన దానికంటే బలమైన ఆర్థిక వృద్ధి (Economic growth) కనిపిస్తోందని, ఈ పరిణామాలు కొనసాగితే 2021 మధ్య నాటికి ప్రపంచ జీడీపీ (GDP) కొవిడ్-19కి ముందు ఉన్న స్థాయికి తిరిగి వస్తుందని డచ్ బ్యాంక్ సోమవారం తెలిపింది. అయితే, భారీగా పెరుగుతున్న రుణస్థాయిలు, విధాన మార్పులు ఆర్థిక సంక్షోభ ప్రమాదాన్ని పెంచే అవకాశాలున్నాయని డచ్ బ్యాంక్ అభిప్రాయపడింది. ‘గత కొంత కాలంగా కొవిడ్ నుంచి ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ తాము […]

Update: 2020-09-21 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని నెలలుగా ఊహించిన దానికంటే బలమైన ఆర్థిక వృద్ధి (Economic growth) కనిపిస్తోందని, ఈ పరిణామాలు కొనసాగితే 2021 మధ్య నాటికి ప్రపంచ జీడీపీ (GDP) కొవిడ్-19కి ముందు ఉన్న స్థాయికి తిరిగి వస్తుందని డచ్ బ్యాంక్ సోమవారం తెలిపింది. అయితే, భారీగా పెరుగుతున్న రుణస్థాయిలు, విధాన మార్పులు ఆర్థిక సంక్షోభ ప్రమాదాన్ని పెంచే అవకాశాలున్నాయని డచ్ బ్యాంక్ అభిప్రాయపడింది.

‘గత కొంత కాలంగా కొవిడ్ నుంచి ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ తాము ఊహించిన దానికంటే చాలా వేగంగా ఉందని’ డచ్ గ్లోబల్ ఎకనామిక్ రీసెర్చ్ హెడ్ పీటర్ హూపర్ క్లయింట్లకు ఇచ్చిన నోట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి ప్రపంచ జీడీపీ ప్రీ-కోవిడ్ స్థాయిలో సగం వెనుకబడి ఉంటుందని అంచనా వేశామని, కానీ ఇప్పుడు వచ్చే ఏడాది మధ్యలోనే ప్రీ-కొవిడ్ స్థాయికి చేరుకునేంత వేగంగా పునరుద్ధరణ కనిపిస్తోందన్నారు. అదేవిధంగా, 2020 ఏడాదికి ప్రపంచ జీడీపీ వృద్ధి ఇదివరకు అంచనా వేసిన -5.9 శాతం నుంచి -3.9 శాతానికి సవరిస్తున్నట్టు డచ్ బ్యాంకు వెల్లడించింది. అలాగే, 2021కి వృద్ధి అంచనాను 5.3 శాతం నుంచి 5.6 శాతానికి పెంచింది.

Tags:    

Similar News