కరోనా వైరస్‌ను డెట్టాల్ చంపలేదు!

        నావల్ కరోనా వైరస్‌ను డెట్టాల్ స్ప్రే వాడటం ద్వారా మట్టుపెట్టవచ్చని సోషల్ మీడియాలో సంచరిస్తున్న ఓ వార్త గురించి డెట్టాల్ తయారీ సంస్థ ఆర్‌బీ స్పష్టతనిచ్చింది. డెట్టాల్ స్ప్రే బాటిల్ మీది లేబుల్ ప్రకారం అన్ని రకాల జలుబు వైరస్‌లను డెట్టాల్ చంపగలదని ఫేస్‌బుక్‌లో ఓ యూజర్ పెట్టిన పోస్టు మీద ఆర్‌బీ స్పందించింది.         “ప్రస్తుతమున్న అత్యవసర పరిస్థితుల్లో అందరూ తయారీదారుల్లాగే ఆర్‌బీకి కూడా ఈ […]

Update: 2020-02-05 00:28 GMT

నావల్ కరోనా వైరస్‌ను డెట్టాల్ స్ప్రే వాడటం ద్వారా మట్టుపెట్టవచ్చని సోషల్ మీడియాలో సంచరిస్తున్న ఓ వార్త గురించి డెట్టాల్ తయారీ సంస్థ ఆర్‌బీ స్పష్టతనిచ్చింది. డెట్టాల్ స్ప్రే బాటిల్ మీది లేబుల్ ప్రకారం అన్ని రకాల జలుబు వైరస్‌లను డెట్టాల్ చంపగలదని ఫేస్‌బుక్‌లో ఓ యూజర్ పెట్టిన పోస్టు మీద ఆర్‌బీ స్పందించింది.

“ప్రస్తుతమున్న అత్యవసర పరిస్థితుల్లో అందరూ తయారీదారుల్లాగే ఆర్‌బీకి కూడా ఈ కొత్త వైరస్‌ని పరీక్షించే అవకాశం దొరకలేదు. అందుకే మా ఉత్పత్తి ప్రభావం దీని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పలేకపోతున్నాం” అని ప్రకటించింది. అలాగే వైరస్‌ని ఎదుర్కోవడంలో భాగంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపింది.

Tags:    

Similar News