దేత్తడి కథ ఇక ముగిసింది

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేం దేత్తడి హారికను నియమించడంపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఇవాళ ఫుల్‌స్టాఫ్ పడింది. బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిన మూడు రోజుల్లో ఆమె కథ ముగిసింది. తాజాగా దేత్తడి హారిక కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్‌డేట్. మహిళా దినోత్సవం […]

Update: 2021-03-10 23:57 GMT
దేత్తడి కథ ఇక ముగిసింది
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేం దేత్తడి హారికను నియమించడంపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఇవాళ ఫుల్‌స్టాఫ్ పడింది. బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిన మూడు రోజుల్లో ఆమె కథ ముగిసింది. తాజాగా దేత్తడి హారిక కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక వీడియోను విడుదల చేసింది.

‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్‌డేట్. మహిళా దినోత్సవం రోజు నన్ను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి నేను స్వచ్చంధంగా తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్‌’ అంటూ హారిక ఆ వీడియో తెలిపింది.

కాగా తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హారికను ప్రకటించడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. టూరిజం ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా సంబంధిత మంత్రి, సీఎంవో అధికారులకు సమాచారం ఇవ్వకుండా తనకు తానే నిర్ణయం తీసుకుని దేత్తడి హారికను నియమించడంపై విమర్శలొచ్చాయి. ఈ వివాదం క్రమంలో నొచ్చుకన్న దేత్తడి హారిక.. తనకు తానుగా పదవి నుంచి తప్పుకుుంది.

Tags:    

Similar News