అందరూ అప్రమత్తంగా ఉన్నారు : డిప్యూటీ మేయర్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో, అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. వరదనీరు వచ్చే అవకాశం ఉన్నచోట వెంటనే ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జీహెచ్‌ఎంసీలో అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను కమ్యూనిటీ హాళ్లకు తరలించాలన్నారు.

Update: 2020-10-17 21:47 GMT

Tags:    

Similar News