బాక్సరా?..రాక్షసుడా?
విజయం సాధించిన తరువాత బాక్సింగ్ రింగ్‌లో బ్రిటన్ బాక్సర్ చర్య భీతిగొలిపింది. క్రీడా ప్రేమికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వీడు మనిషా? రాక్షసుడా? అనేలా చేసింది. ఇంతకీ ఏం చేశాడంటే.. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్యూబీసీ) హెవీ వెయిట్ ఛాంపియన్‌షిష్ పోటీని బ్రిటన్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ, అమెరికా ఛాంపియన్ బాక్సర్ డియోంటి వైల్డర్ మధ్య పోటీ నిర్వహించింది. లాస్‌వెగాస్‌లోని ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో ఈ బౌట్‌ను నిర్వహించింది. ఏడు రౌండ్లు పాటు హోరాహోరీగా సాగిన […]
విజయం సాధించిన తరువాత బాక్సింగ్ రింగ్‌లో బ్రిటన్ బాక్సర్ చర్య భీతిగొలిపింది. క్రీడా ప్రేమికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వీడు మనిషా? రాక్షసుడా? అనేలా చేసింది. ఇంతకీ ఏం చేశాడంటే.. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్యూబీసీ) హెవీ వెయిట్ ఛాంపియన్‌షిష్ పోటీని బ్రిటన్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ, అమెరికా ఛాంపియన్ బాక్సర్ డియోంటి వైల్డర్ మధ్య పోటీ నిర్వహించింది.
లాస్‌వెగాస్‌లోని ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో ఈ బౌట్‌ను నిర్వహించింది. ఏడు రౌండ్లు పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో బ్రిటన్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ రీ విరుచుకుపడ్డాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఇంతవరకు ఓటమి ఎరుగని వైల్డర్‌కు తన పంచ్‌లను రుచి చూపించాడు. టైసన్ పవర్ పంచ్‌ల దాడికి వైల్డర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఛాంపియన్‌గా నిలవాలన్న లక్ష్యంతో వైల్డర్ పంచ్‌లకు వెరవకుండా దాడికి దిగాడు. దీంతో వైల్డర్‌ను ఓడించి టైసన్ ఫ్యూరీరీ ఛాంపియన్‌గా అవతరించాడు.
బౌట్‌లో విజయం సాధించిన అనంతరం… అంతవరకు చేసిన పోరాటానికి గౌరవ సూచకంగా ప్రత్యర్థిని కౌగిలించుకుని వీడ్కోలు పలకడం సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ప్రదర్శించే సమయంలో డియోంటి వైల్డర్ చెవి నుంచి కారుతున్న రక్తాన్ని టైసన్ ఫ్యూరీరీ నాకాడు. ఇది మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించిన వారితో పాటు పరోక్షంగా వీక్షించేవారిని కూడా ఆశ్చర్యానికి, ఆందోళణకు గురిచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు జిప్సీ కింగ్‌గా పిలువబడే టైసన్‌ను ‘మనిషా?.. రాక్షసుడా?’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.