5నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తాం..

దిశ, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు 5 నిమిషాలు ఆలసమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వెంకటనర్సమ్మ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తంగా 362 పరీక్ష కేంద్రాలు ఉండగా, 82వేల 502 మంది విద్యార్థులు పరీక్షలకు హజరకానున్నట్టు చెప్పారు. అందులో 11,817 మంది విద్యార్థులు ప్రయివేటుగా పరీక్షలు రాస్తున్నట్టు వివరించారు. పరీక్షల నిర్వహణ, తనిఖీలకు 256 సిట్టింగ్ స్క్వాడ్స్, 17 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ఈ నెల 19 నుంచి […]

Update: 2020-03-17 09:49 GMT

దిశ, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు 5 నిమిషాలు ఆలసమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వెంకటనర్సమ్మ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తంగా 362 పరీక్ష కేంద్రాలు ఉండగా, 82వేల 502 మంది విద్యార్థులు పరీక్షలకు హజరకానున్నట్టు చెప్పారు. అందులో 11,817 మంది విద్యార్థులు ప్రయివేటుగా పరీక్షలు రాస్తున్నట్టు వివరించారు. పరీక్షల నిర్వహణ, తనిఖీలకు 256 సిట్టింగ్ స్క్వాడ్స్, 17 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ఈ నెల 19 నుంచి ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. హాల్ టికెట్లను bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా బుధవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 8.30 గంటలకే చేరుకోవాలని, అనుకోని కారణాల వలన విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అంటే 9.35 నిమిషాలకు వచ్చినా పరీక్షకు అనుమతి ఇస్తామన్నారు. సెంటర్ వివరాలు, పరీక్ష వివరాలకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు, సూచనలకు 040-2970 1474 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో విద్యార్థులు మాస్క్‌లు ధరించి సెంటర్లకు రావాలని తెలిపారు.

tags ; hyd, deo venkata narasamma, all students carry masks, 5 minutes delay acceptable

Tags:    

Similar News