అడ్డాకులలో ఏదీ వారి అడ్రస్!
దిశ, మహబూబ్ నగర్ : రాష్ట్రమంతా పరిస్థితి ఒకలా ఉంటే అక్కడ మాత్రం విచిత్రంగా ఉంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో మేము సైతం అంటున్నారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రధాన బాధ్యతలు మోసేవారే తమ బాధ్యతలను మరిచి ఇంట్లో కూర్చుంటున్నారు.. అదేమిటో మీరే చూడండి.. ప్రజాప్రతినిధులు అందరూ కరోనా నియంత్రణ చర్యలో భాగస్వామ్యం కావాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా కూడా కొంతమంది […]
దిశ, మహబూబ్ నగర్ : రాష్ట్రమంతా పరిస్థితి ఒకలా ఉంటే అక్కడ మాత్రం విచిత్రంగా ఉంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో మేము సైతం అంటున్నారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రధాన బాధ్యతలు మోసేవారే తమ బాధ్యతలను మరిచి ఇంట్లో కూర్చుంటున్నారు.. అదేమిటో మీరే చూడండి..
ప్రజాప్రతినిధులు అందరూ కరోనా నియంత్రణ చర్యలో భాగస్వామ్యం కావాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా కూడా కొంతమంది మాత్రం వాటిని పట్టించుకోవడంలేదు. సీఎం అదేశాలతో అటు మంత్రుల దగ్గర నుండి వార్డు సభ్యుల వరకు ప్రతిఒకరూ గ్రామాల్లో ప్రజలకు కరోనా నియంత్రణ పై అవగాహన కల్పిస్తూ.. నిత్యం ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటున్నారు. కానీ, అడ్డాకుల మండలంలో మాత్రం పరిస్థితి పూర్తిగా అందుకు భిన్నంగా ఉంది. అటు జెడ్పీటీసీ, ఎంపీపీలు ఇద్దరు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు వారి అడ్రస్ గల్లంతయ్యిందని గుసగుసలాడుతున్నారు.
సొంత అవసరాల కోసం వెళ్లారు
అడ్డాకుల మండల జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో ఊళ్లో లేకపోవడం శోచనీయం. తమ సొంత అవసరాల కోసం హైదరాబాద్ వెళ్లడం వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ అత్యవసర సమయంలో జెడ్పీటీసీ లేకపోవడం వారి బాధ్యతలను మర్చిపోయారని ప్రజలు మండిపడుతున్నారు.
ఇంట్లో కూర్చోవడం గమనార్హం
అలాగే, మండలానికి బాస్ అనిపించుకునే ఎంపీపీ నాగార్జున రెడ్డి సైతం ఇంట్లో కూర్చోవడం గమనార్హం. గ్రామాలలో తిరుగుతూ కరోనా వైరస్ గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదు. మండలాల్లో అభివృద్ధి జరగాలన్న అత్యవసర సమయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే పాలకవర్గంలో తీర్మానం తప్పనిసరి. అయితే.. ఇక్కడ ఎటువంటి తీర్మానాలు లేకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయితీ అధికారులే, వైద్య బృందం, మండలం పాలన సాగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మండలానికి చెందిన ఇద్దరు ప్రధాన బాధ్యతలు ఉన్న నాయకులు ఇలా ఎవరికివారు తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags: Mahaboobnagar, Addakula, Awareness programs, Forgotten, democratizing, forgetting of responsibilities, zptc, mpps