‘బుక్స్ బై బైస్కిల్’
దిశ, వెబ్‌డెస్క్: సినిమా ప్రేమికులు.. క్రీడాభిమానులు, ఉన్నట్లే పుస్తక పురుగులు ఉంటారు. అంటే.. అక్షర ప్రేమికులన్నమాట. ఎంతసేపు టీవీ చూసినా.. ఎన్ని గంటలు ఫోన్లో గడిపినా.. రోజులో నాలుగు వాక్యాలు చదవనిదే కొందరికీ రోజు గడవందంటే అతిశయోక్తి కాదు. పుస్తక జ్ఞానం జీవితాంతం వెంట వస్తుందని వారి అభిప్రాయం. లాక్ డౌన్ వేళ.. చీకట్లతోపాటు.. నిరుత్సాహం నిండిన శరీరాల్లో.. ధైర్యం నింపేవి నాలుగు అక్షరాలు, పది మంచి మాటలే అని పుస్తకాభిమానులు అంటారు. ‘చిరిగినా చొక్కా అయినా.. […]
దిశ, వెబ్‌డెస్క్: సినిమా ప్రేమికులు.. క్రీడాభిమానులు, ఉన్నట్లే పుస్తక పురుగులు ఉంటారు. అంటే.. అక్షర ప్రేమికులన్నమాట. ఎంతసేపు టీవీ చూసినా.. ఎన్ని గంటలు ఫోన్లో గడిపినా.. రోజులో నాలుగు వాక్యాలు చదవనిదే కొందరికీ రోజు గడవందంటే అతిశయోక్తి కాదు. పుస్తక జ్ఞానం జీవితాంతం వెంట వస్తుందని వారి అభిప్రాయం. లాక్ డౌన్ వేళ.. చీకట్లతోపాటు.. నిరుత్సాహం నిండిన శరీరాల్లో.. ధైర్యం నింపేవి నాలుగు అక్షరాలు, పది మంచి మాటలే అని పుస్తకాభిమానులు అంటారు. ‘చిరిగినా చొక్కా అయినా.. తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని ఓ మహానుభావుడు అన్నమాటను పుస్తక ప్రియులు అక్షరాలా పాటిస్తారు. అలాంటి వాళ్ల కోసమే.. తిరువనంతపురంలో.. ‘బుక్స్ బై బైస్కిల్’ అనే ఇన్షియేటివ్‌ను ప్రారంభించారు. కోరుకున్న పుస్తకాన్ని ఆర్డర్ చేస్తే చాలు.. సైకిల్ మీద వచ్చి.. మన ఇంట్లో అందజేస్తారు.
లాక్‌డౌన్ సమయంలో కాళ్లు కదపడానికి వీళ్లు లేదు. ఆన్ లైన్ షాపింగ్ చేద్దామన్నా అవి కూడా అందుబాటులో లేవు. గ్రంథాలయాలు కూడా తాళం వేశారు? మరి పుస్తకం చదవడం ఎలా? అలాంటి పుస్తక ప్రియుల కోసమే.. కేరళ రాజధాని తిరువనంతపురంలో ‘బుక్స్ బై బైస్కిల్’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు.
ఆర్డర్ చేస్తే చాలు..
ఆర్డర్ చేసిన పుస్తకాలను ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారు. తిరువనంతపురం మేయర్ ప్రకాశ్ పి గోపినాథ్ ఈ ఇన్షియేటివ్ కు శ్రీకారం చుట్టారు. బుక్ లవర్స్ తమ ఇష్టమైన బుక్ ఆర్డర్ చేసుకోవచ్చు. పుస్తకాలపై పది శాతం డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. అయితే కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్లకే ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఇంగ్లిష్, మలయాళం పుస్తకాలతోపాటు పిల్లల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. డీసీ బుక్స్, మాతృభూమి బుక్స్ , పూర్ణ పబ్లికేషన్స్, చింత పబ్లిషర్స్, గ్రీన్ బుక్స్, మాడ్రన్ బుక్స్, మైత్రి బుక్స్ లాంటి బుక్ హౌస్ ల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ బుక్స్, అందుబాటులో ఉన్న బుక్స్ వివరాలను ‘బుక్స్ బై బైస్కిల్’ ఫేస్ బుక్ అకౌంట్, వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రైటర్ జానీ ఎమ్ ఎల్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం 7356694005 కి కాల్ చేయొచ్చు.
tags :coronavirus, lockdown, book lovers, books by bicycle, online orders, facebook, whatsapp