3డీ టెక్నాలజీతో ఫేస్ షీల్డ్ తయారీ .. ఢిల్లీ యువకుడి ఘనత
దిశ వెబ్ డెస్క్: కరోనా పోరులో.. తమ ప్రాణాలను పణంగా పెట్టి .. నిద్రహారాలు మానుకుని పనిచేస్తున్నారు వైద్యులు. నర్సులు కూడా వైద్యులను మించి సేవలందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే వాళ్లందరికీ కూడా రక్షణ పరికరాలు అవసరమే. కానీ వాటి కొరత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కొరత తీర్చడం కోసం కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా అందుకోసం కృషి చేస్తున్నాయి. వారి రక్షణ […]
దిశ వెబ్ డెస్క్: కరోనా పోరులో.. తమ ప్రాణాలను పణంగా పెట్టి .. నిద్రహారాలు మానుకుని పనిచేస్తున్నారు వైద్యులు. నర్సులు కూడా వైద్యులను మించి సేవలందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే వాళ్లందరికీ కూడా రక్షణ పరికరాలు అవసరమే. కానీ వాటి కొరత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కొరత తీర్చడం కోసం కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా అందుకోసం కృషి చేస్తున్నాయి. వారి రక్షణ కోసం.. తన వంతుగా ఓ చిన్న సాయం చేస్తానంటూ .. ఫేస్ షీల్డ్ లు రూపొందిస్తున్నాడు ఢిల్లీ యువకుడు. అతడే ఉదిత్ కక్కర్.
ఉదిత్ కక్కర్ ప్రస్తుతం బీబీఏ చేస్తున్నాడు. అతడి తల్లి కూడా ఓ డాక్టర్. కొద్ది రోజుల క్రితం ఆమెకు ఫేస్ షీల్డ్ కావాల్సి వచ్చింది. అయితే వాళ్లమ్మ ఒక్కరికే ఈ సమస్య కాదని, వైద్య సిబ్బందికీ వీటి అవసరం ఉందని తెలుసుకున్నాడు ఉదిత్. ఆ కొరతను ఎలాగైన తీర్చాలనుకున్నాడు ఉదిత్. వెంటనే 3డీ టెక్నాలజీతో ఫేస్ షీల్డ్ ల తయారీ చేయాలనుకున్నాడు. ఆలస్యం చేయకుండా..త్రీడీ ప్రింటర్ల ద్వారా ఫేస్ షీల్డ్‌లను తయారీ మొదలుపెట్టాడు. ప్రతిరోజు 20 నుంచి 25 వరకు ఫేస్ షీల్డ్ లు రూపొందిస్తూ.. సమాజం పట్ల తనుకున్న బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఫేస్ షీల్డ్ ల కోసం ట్రాన్స్ పరెంట్ ఏ4 సైజ్డ్ ఓవర్ హెడ్ ప్రొటెక్టర్ షీట్ష్ (ఓహెచ్ పీ) , ఎలాస్టిక్ బ్యాండ్స్ ఉపయోగిస్తున్నాడు. ఉదిత్ ఉత్పత్తి చేస్తున్న ఫేస్ షీల్డ్ ల గురించి తెలుసుకున్న లాబోరేటరీ, వైద్య సిబ్బందిలను నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆరు కాంట్రాక్ట్ లకు ఒప్పుకున్నాడు. అన్నీ కూడా ఢిల్లీలోనే. దేశ రాజధాని వెలపల నుంచి కూడా ఫేస్ షీల్డ్ లు కావాలని ఆర్డర్లు వస్తున్న లాక్ డౌన్ కారణంతో .. షిప్పింగ్ కష్టమవుతుందని .. వాటిని ఒప్పుకోలేదని ఉదిత్ చెబుతున్నాడు.
Tags: coronavirus, doctors, face shields, delhi, udith kakkar