ఓటు ఎక్కడో… వ్యాక్సిన్ అక్కడే.. ఢిల్లీ సర్కార్ నూతన ప్రచార కార్యక్రమం ప్రారంభం

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 45 ఏండ్లకు పైబడిన వారందరికీ రానున్న నాలుగు రోజుల్లో వ్యాక్సినేషన్ చేయడమే లక్ష్యంగా కొత్త క్యాంపెయిన్‌కు ఆప్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓటు ఎక్కడో.. అక్కడే వ్యాక్సిన్(జహా ఓట్, వహా వ్యాక్సిన్) పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో 45 ఏండ్లకు పైబడిన వారు 57 లక్షల […]

Update: 2021-06-07 09:01 GMT

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 45 ఏండ్లకు పైబడిన వారందరికీ రానున్న నాలుగు రోజుల్లో వ్యాక్సినేషన్ చేయడమే లక్ష్యంగా కొత్త క్యాంపెయిన్‌కు ఆప్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓటు ఎక్కడో.. అక్కడే వ్యాక్సిన్(జహా ఓట్, వహా వ్యాక్సిన్) పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో 45 ఏండ్లకు పైబడిన వారు 57 లక్షల మంది ఉన్నారని సీఎం చెప్పారు. వారిలో 27 లక్షల మంది కనీసం ఒక్క డోసునైనా పొందిన వారు ఉన్నారని వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఈ గ్రూపు వారికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ సెంటర్లు ప్రస్తుతం ఖాళీగా కనబడుతున్నాయనీ తెలిపారు.

కొద్ది మంది మాత్రమే వ్యాక్సినేషన్ కోసం వస్తున్నారని పేర్కొన్నారు. దీంతో వారి ఇంటి వద్దకే తాము వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు తాము ఎక్కడైతే ఓటు హక్కు వినియోగించుకున్నారో అక్కడికే వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రచారం చేయనున్నట్టు వివరించారు. సాధారణంగా పోలింగ్ బూత్‌లు వారి ఇండ్లకు దగ్గరలోనే ఉంటాయనీ, కాబట్టి అక్కడికి వారు సులువుగా నడిచి వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News