రెండు నెలలు ఉచిత రేషన్.. ఢిల్లీ సీఎం కీలక ప్రకటన

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల పాటు పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీని ద్వారా 72 లక్షల మంది రేషన్ కార్డుదారులకు లబ్ది చేకూరనుంది. అంతేగాక కరోనా కాలంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు రెండు నెలల పాటు నెలకు రూ. 5 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఇది ఢిల్లీలోని 1.56 లక్షల […]

Update: 2021-05-04 03:26 GMT

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల పాటు పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీని ద్వారా 72 లక్షల మంది రేషన్ కార్డుదారులకు లబ్ది చేకూరనుంది. అంతేగాక కరోనా కాలంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు రెండు నెలల పాటు నెలకు రూ. 5 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఇది ఢిల్లీలోని 1.56 లక్షల డ్రైవర్లకు వర్తించనుంది. పేదలకు ఉచిత రేషన్ ఇచ్చి, ఆర్థిక సాయం ప్రకటించినంత మాత్రానా ఢిల్లీలో మరో రెండు నెలల పాటు లాక్‌డౌన్ విధిస్తామని కాదని, ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉండేందుకే సాయం ప్రకటిస్తున్నామని వివరించారు. ఢిల్లీలో గతనెలలో కేసులు విపరీతంగా పెరగడంతో రెండు వారాల పాటు విధించిన లాక్‌డౌన్‌ను మే 1న మరోవారం పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీఎం తాజా ప్రకటనతో లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News