మేల్కొనగానే అలారం ఆపేస్తా: దీపిక

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా దీపికా పదుకునేకు వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లాడిన దీపిక..పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయింది. ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోన్న దీపు.. హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఇంటర్న్’ రీమేక్ చేయబోతున్నది. ‘ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ద్రౌపది రోల్ చేస్తోంది. కాగా, సోషల్ మీడియాలో ‘నన్ను అడగండి(Ask Me)’ అనే సెషన్‌ను అభిమానుల […]

Update: 2021-01-20 07:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా దీపికా పదుకునేకు వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లాడిన దీపిక..పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయింది. ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోన్న దీపు.. హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఇంటర్న్’ రీమేక్ చేయబోతున్నది. ‘ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ద్రౌపది రోల్ చేస్తోంది. కాగా, సోషల్ మీడియాలో ‘నన్ను అడగండి(Ask Me)’ అనే సెషన్‌ను అభిమానుల కోసం నిర్వహించింది దీపిక.

తన ఇన్ స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోలను షేర్ చేసింది. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అభిమానులలో ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చి వారిని ఆశ్చర్యపరిచింది. మేల్కొన్న తర్వాత మీరు చేసే మొదటి పని ఏది అని ఓ ఫ్యాన్ అడిగ్గా..తాను మేల్కొన్నప్పుడు చేసే మొదటి పని నా అలారంను ఆపేయడమని తెలిపింది. ఫిట్‌నెస్ కాపాడుకోవడం కోసం రోజూ వ్యాయమం చేస్తానని చెప్పింది.

Tags:    

Similar News