అమీర్‌తో దీపిక @ 2000
సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. వాటి గురించి చర్చించేందుకు ఎక్కడలేని ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అయినా ఏవో కొన్ని విషయాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఫ్యాన్స్‌తో సెలెబ్రిటీల ఇంటరాక్షన్ పెరిగింది. దీంతో వారి చిన్ననాటి విషయాలు, లైఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ గురించి షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తిరమైన ఫోటో షేర్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె. జనవరి 1, 2000 […]
సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. వాటి గురించి చర్చించేందుకు ఎక్కడలేని ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అయినా ఏవో కొన్ని విషయాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఫ్యాన్స్‌తో సెలెబ్రిటీల ఇంటరాక్షన్ పెరిగింది. దీంతో వారి చిన్ననాటి విషయాలు, లైఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ గురించి షేర్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఆసక్తిరమైన ఫోటో షేర్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె. జనవరి 1, 2000 సంవత్సరంలో దిగిన ఈ పిక్‌లో.. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తోపాటు దీపిక, తన తల్లిదండ్రులు, చెల్లెలు కూడా ఉన్నారు. ‘నాకు 13 ఏళ్లప్పుడు తీసిన ఈ ఫొటోలో ఉన్న స్టార్.. లంచ్‌లో పెరుగన్నం తిన్నారు. కానీ, నాకు ఆఫర్ చేయలేదు, నేను తినలేదు’ అని చెప్పింది.
కాగా దీపిక చివరగా.. యాసిడ్ ఎటాక్ నుంచి ప్రాణాలతో బయటపడి పోరాటం చేసిన ‘లక్ష్మీ అగర్వాల్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘చపాక్’ చిత్రంలో నటించింది. త్వరలో భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘83’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది.