ఇది కొంతలో కొంత బెటరే
దిశ, వెబ్ డెస్క్: యావత్ ప్రపంచమే కరోనాతో గజగజ వణుకుతున్న విషయం తెలిసిందే. అయితే, గతకొద్ది రోజుల నుంచి ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండులక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే, గడిచిన 24 గంటల్లో కొంత కేసుల సంఖ్య తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 18,9806 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.20 కోట్లు దాటింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4028 మంది చనిపోయారు.. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7.76 […]
దిశ, వెబ్ డెస్క్: యావత్ ప్రపంచమే కరోనాతో గజగజ వణుకుతున్న విషయం తెలిసిందే. అయితే, గతకొద్ది రోజుల నుంచి ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండులక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే, గడిచిన 24 గంటల్లో కొంత కేసుల సంఖ్య తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 18,9806 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.20 కోట్లు దాటింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4028 మంది చనిపోయారు.. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7.76 లక్షలు దాటింది.
ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 1.47 కోట్ల మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 64.83 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. బ్రెజిల్ లో 33.63 లక్షలు కేసులు నమోదవగా 1.08 లక్షలకు పైగా కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. ఇటు అమెరికాలో గడిచిన 24 గంటల్లో 39,333 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటివరకు 56.10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1.73 లక్షలకు పైగా బాధితులు మృతిచెందారు.