ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం
దిశ, సినిమా: బెంగాలీ ఫిల్మ్ మేకర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా(77) కన్నుమూశారు. కొన్నాళ్లుగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్‌తో కోల్‌కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన వెస్ట్‌బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ.. డీబీ గుప్తా మరణం బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్రేట్ లాస్ అని తెలిపింది. గుప్తా మరణవార్త బాధిస్తోందన్న సీఎం.. తన రచనలు, సాహిత్యాన్ని సినిమా భాషలోకి ప్రవేశపెట్టిన తీరు ప్రశంసనీయమని, ఇండస్ట్రీకి […]
దిశ, సినిమా: బెంగాలీ ఫిల్మ్ మేకర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా(77) కన్నుమూశారు. కొన్నాళ్లుగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్‌తో కోల్‌కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన వెస్ట్‌బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ.. డీబీ గుప్తా మరణం బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్రేట్ లాస్ అని తెలిపింది. గుప్తా మరణవార్త బాధిస్తోందన్న సీఎం.. తన రచనలు, సాహిత్యాన్ని సినిమా భాషలోకి ప్రవేశపెట్టిన తీరు ప్రశంసనీయమని, ఇండస్ట్రీకి చేసిన సేవలు మరిచిపోలేమని ట్వీట్ చేసింది. తన కుటుంబం, స్నేహితులు, ఆరాధకులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ఐదుసార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న డీబీ గుప్తా.. గౌతమ్ ఘోష్, అపర్ణ సేన్‌లతో కలిసి 1980, 1990లలో బెంగాల్‌లో పారలల్ సినిమా మూమెంట్‌కు ఫ్లాగ్ బేరర్‌గా నిలిచారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దూరత్వా (1978), గ్రిహజుద్ధ (1982), ఆంధి గాలి (1984)’ లాంటి సినిమాలు బెంగాల్‌లోని నక్సలైట్ ఉద్యమంపై దృష్టి సారించగా.. ఇవి అక్కడి ప్రజల్లో సామూహిక చైతన్యాన్ని పెంపొందించాయి. ఇక బాగ్ బహదూర్ (1989), చారచార్ (1993), లాల్ దర్జా (1997), మోండో మేయర్ ఉపఖ్యాన్ (2002), కల్‌పురుష్ (2008) సినిమాలకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో నేషనల్ అవార్డు రాగా.. దూరత్వా (1978), తహదర్ కథ (1993) చిత్రాలకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ బెంగాలీ కేటగిరీలో జాతీయ అవార్డు లభించింది. కాగా ఉత్తరా(2000), స్వాప్నర్ దిన్ (2005) చిత్రాలకు డీబీ గుప్తా ఉత్తమ దర్శకుడిగా గౌరవించబడ్డారు. ‘సూట్ కేస్, హిమ్జోగ్, గోవిర్ అరలే, కాఫిన్ కింబా, చాటా కహిని, రోబోటర్ గాన్, శ్రేష్ట కబితా, భోంబోలర్ ఆశ్చర్య కహిని ఓ అనన్య కబితా’ వంటి పుస్తకాలతో రచయితగానూ సమాజంలో మార్పుకు కృషి చేశారు.
Saddened at the passing away of eminent filmmaker Buddhadeb Dasgupta. Through his works, he infused lyricism into the language of cinema. His death comes as a great loss for the film fraternity. Condolences to his family, colleagues and admirers
— Mamata Banerjee (@MamataOfficial) June 10, 2021