మండుతున్న ఎండలు.. మొదలైన ఉక్కపోత

వేసవి కాలం ముందే వచ్చింది. గతేడాది అక్టోబర్ వరకూ వర్షాలు కురవగా.. ఇప్పుడు వేసవి కాలం ముందుగానే మొదలైంది. మార్చికి ముందే ఎండలు మండుతున్నాయి. సోమవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో శనివారం 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు ఉష్ణోగ్రత 36 డిగ్రీలు కాగా.. అత్యధికం 39.4 డిగ్రీలు. దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.6 నుంచి 39.4 డిగ్రీల […]

Update: 2021-02-27 12:46 GMT

వేసవి కాలం ముందే వచ్చింది. గతేడాది అక్టోబర్ వరకూ వర్షాలు కురవగా.. ఇప్పుడు వేసవి కాలం ముందుగానే మొదలైంది. మార్చికి ముందే ఎండలు మండుతున్నాయి. సోమవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో శనివారం 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు ఉష్ణోగ్రత 36 డిగ్రీలు కాగా.. అత్యధికం 39.4 డిగ్రీలు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.6 నుంచి 39.4 డిగ్రీల వరకు నమోదయ్యాయి. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగా.. పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో 39.3 డిగ్రీలు నమోదైంది. మంచిర్యాల, జగిత్యాల, సూర్యాపేట జిల్లాల్లో 39 డిగ్రీలు దాటింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరు‌గు‌తు‌న్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో కనిష్ఠంగా 13.7 డిగ్రీలు ఉండగా.. ఆది‌లా‌బాద్‌, మెదక్‌, నిర్మల్​ జిల్లాల్లో 14 డిగ్రీలుగా రికార్డు అయింది. తూర్పు, ఈశాన్య దిశ‌ల‌నుంచి గాలులు వీస్తు‌న్నా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. హైద‌రా‌బా‌ద్‌లో ఉష్ణోగ్రతలు పెరిగి పగటి పూట ప్రజలు ఉక్కపోతకు గుర‌వు‌తు‌న్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరు‌గు‌తా‌యని వాతావరణశాఖ అధి‌కా‌రులు తెలిపారు.

సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి ఉంటాయని చెబుతున్నారు. అత్యల్పంగా 16 డిగ్రీలు ఉంటాయని చెప్పారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో వేడి పెరిగింది. సింగరేణి ఏరియాల్లో వేడి ప్రతాపం ఎక్కువగా ఉంటోంది. మార్చి మొదట్లోనే ఎండలు ఇలా మండుతుంటే.. ఇక నడి వేసవి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం, సాయంత్రం చల్లగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నా.. సాయంత్రానికి చల్లబడుతోంది.

Tags:    

Similar News