అతడు క్రికెటర్‌ మాత్రమే కాదు.. మంచి నటుడు

దిశ, వెబ్‌డెస్క్: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా జట్టులో హార్డ్ హిట్టర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సారథి.. అన్నింటికీ మించి తనకున్న సామర్థ్యలతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ప్రియులను ప్రత్యేకంగా ఆకర్షించిన ఆటగాడు. బరిలో దిగితే బౌండరీలు బాదుతూ ప్రత్యర్థులకు వణుకుపుట్టించే డేరింగ్ డాషింగ్ అతడు. ఇది ప్రొఫెషనల్ ప్రొఫైల్ మాత్రమే.. కానీ, కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అంతకుమించి అన్న తరహాలో ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు. అతడిలో ఉన్న మరో కోణం భారతీయులను అమితంగా ఆకర్షించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సైతం […]

Update: 2021-01-30 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా జట్టులో హార్డ్ హిట్టర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సారథి.. అన్నింటికీ మించి తనకున్న సామర్థ్యలతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ప్రియులను ప్రత్యేకంగా ఆకర్షించిన ఆటగాడు. బరిలో దిగితే బౌండరీలు బాదుతూ ప్రత్యర్థులకు వణుకుపుట్టించే డేరింగ్ డాషింగ్ అతడు. ఇది ప్రొఫెషనల్ ప్రొఫైల్ మాత్రమే.. కానీ, కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అంతకుమించి అన్న తరహాలో ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు.

అతడిలో ఉన్న మరో కోణం భారతీయులను అమితంగా ఆకర్షించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సైతం వార్నర్‌‌ను చూసి ఆశ్చర్యపోయేలా చేసింది. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్, హలీవుడ్ ఇలా తేడా లేకుండా అన్ని స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగులతో వార్నర్ అదరగొట్టాడు. దీంతో క్రికెట్ రంగంలోనే కాకుండా యాక్టింగ్‌పైన కూడా తన మార్క్‌ను వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా ప్లేయర్ మాత్రమే కాదని.. అందరివాడిగా అదరగొడుతున్నాడని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.క్‌తో మొదలైన వార్నర్ యాక్టింగ్‌ పర్ఫామెన్స్ రోజు రోజుకు అభిమానులకు కొత్త గెటప్‌లతో దర్శనమివ్వసాగాడు. అందులో ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్‌, మహేశ్ బాబు, ప్రభాస్ డైలాగ్స్, ఇస్మార్ట్ శంకర్ మాస్ యాక్టింగ్‌లో వార్నర్ వీడియోలు తెగ హల్‌చల్ చేశాయి. వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున కీలకం కావడంతో ఎక్కువగా తెలుగు వారికి సింక్ అయ్యే క్యారెక్టర్లను మాత్రమే ఎంచుకున్నాడు.త పాపులర్ హీరోల నుంచి వైరల్ వీడియోల వరకు అన్నింటిలో వార్నర్ తనదైన యాక్టింగ్‌తో అభిమానులకు దగ్గరయ్యాడు. ఇటీవల యూట్యూబ్ వ్యూవ్స్‌ రికార్డు బద్ధలు కొట్టిన కేజీఎఫ్-2 టీజర్‌లో కూడా వార్నర్‌ కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతీ ఒక్క సినిమా సన్నివేశాలను తీస్తున్న వార్నర్ వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాడు.

అయితే, ప్రపంచ క్రికెటర్లలో ఏ ఆటగాడు కూడా ఈ సాహసం చేయలేదనే చెప్పాలి. మైదానంలో ఆడి అలసిపోయే ఆటగాళ్లకు.. వార్నర్ వీడియోలు కాస్త ఉపశమనాన్ని ఇస్తాయని పలు సార్లు కామెంటేటర్లు మైదానంలోనే వ్యాఖ్యానించారు. క్రికెట్‌ రంగంలోనే తనదైన ముద్ర వేసిన అతడు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా ఉండటంతో వార్నర్‌ అభిమానులు పండుగ జేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక స్టార్ క్రికెటర్ ఈ స్థాయిలో అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం విశేషం.

Tags:    

Similar News