వార్నర్ మూడో టెస్టుకు రావడం అనుమానమే : కోచ్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ వార్నర్ తొడ కండరాల గాయంతో రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పటికీ కోలుకోకపోవడంతో తొలి రెండు టెస్టులు కూడా ఆడలేదు. కనీసం మూడో టెస్టులో అయినా అతడు ఆడతాడని అభిమానులు భావించారు. అయితే, వార్నర్ మూడో టెస్టు ఆడటంపై కూడా అనుమానంగానే ఉందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ వ్యాఖ్యానించాడు. తొడకండరాల గాయం నుంచి వార్నర్ కోలుకున్నాడు కానీ.. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి […]
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ వార్నర్ తొడ కండరాల గాయంతో రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పటికీ కోలుకోకపోవడంతో తొలి రెండు టెస్టులు కూడా ఆడలేదు. కనీసం మూడో టెస్టులో అయినా అతడు ఆడతాడని అభిమానులు భావించారు. అయితే, వార్నర్ మూడో టెస్టు ఆడటంపై కూడా అనుమానంగానే ఉందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ వ్యాఖ్యానించాడు. తొడకండరాల గాయం నుంచి వార్నర్ కోలుకున్నాడు కానీ.. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి జనవరి 7 నుంచి సిడ్నీలో ప్రారంభమయ్యే మూడో టెస్టు ఆడతాడా లేడా అనేదానిపై ఇంకా స్పష్టత లేదని కోచ్ లాంగర్ ఆదివారం చెప్పారు. మూడో టెస్టు ప్రారంభానికి మరో పది రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటిలోగా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.