తల్లి మరణాన్ని తట్టుకోలేక.. 10ఏళ్లుగా డెడ్ బాడీని

దిశ,వెబ్‌డెస్క్: ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏం చేస్తారు? సాంప్రదాయాన్ని బట్టి దహన సంస్కారాల్ని నిర్వహిస్తారు. కానీ ఓ కూతురు చనిపోయిన తల్లి దహన సంస్కారాలు చేయలేదు. అలా అని వదిలేయలేదు. తల్లిడెడ్ బాడీని తెచ్చుకొని 10ఏళ్ల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. టోక్యోకు చెందిన యుషి యోషినో(48) తల్లి 10ఏళ్ల క్రితం మరణించింది. దీంతో యోషినో తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. తల్లికి దహన సంస్కారాలు చేయకుండానే ఇంట్లోనే 10ఏళ్లపాటు అలాగే ఫ్రీజర్‌లో ఉంచింది. అయితే […]

Update: 2021-01-30 03:36 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏం చేస్తారు? సాంప్రదాయాన్ని బట్టి దహన సంస్కారాల్ని నిర్వహిస్తారు. కానీ ఓ కూతురు చనిపోయిన తల్లి దహన సంస్కారాలు చేయలేదు. అలా అని వదిలేయలేదు. తల్లిడెడ్ బాడీని తెచ్చుకొని 10ఏళ్ల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. టోక్యోకు చెందిన యుషి యోషినో(48) తల్లి 10ఏళ్ల క్రితం మరణించింది. దీంతో యోషినో తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. తల్లికి దహన సంస్కారాలు చేయకుండానే ఇంట్లోనే 10ఏళ్లపాటు అలాగే ఫ్రీజర్‌లో ఉంచింది. అయితే బాధితురాలు చనిపోయేముందు మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్ కు చెందిన అపార్ట్ మెంట్ ను లీజ్ కు తీసుకుంది. ఆ అపార్ట్ మెంట్ లీజ్ గడువు కొద్దిరోజుల క్రితం పూర్తి కావడంతో కుమార్తె ఆ అపార్ట్ మెంట్ నుంచి వేరే అపార్ట్మెంట్కు షిప్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కుమార్తె యోషినో ఖాళీ చేసిన అపార్ట్ మెంట్ను క్లీన్ చేస్తుండగా ఓ ఫ్రీజర్ వెలుగులోకి వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో చనిపోయిన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కూతురు ఇలా ఫ్రీజర్ లో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News