దారుణం తల్లికి మద్యం తాగించి.. ఘోరానికి పాల్పడిన కూతురు..
దిశ, మెదక్: ఆస్తి కోసం పథకం ప్రకారం.. కన్న కూతురే తల్లిని గురువారం దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనను పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించి హంతకురాలును రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం మెదక్ డీఎస్పీ సైదులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన పుస్తి బాలమణి (50) కిషన్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కొడుకు లేకపోవడంతో కుమార్తె నర్సమ్మకు లక్ష్మయ్యతో […]
దిశ, మెదక్: ఆస్తి కోసం పథకం ప్రకారం.. కన్న కూతురే తల్లిని గురువారం దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనను పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించి హంతకురాలును రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం మెదక్ డీఎస్పీ సైదులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన పుస్తి బాలమణి (50) కిషన్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కొడుకు లేకపోవడంతో కుమార్తె నర్సమ్మకు లక్ష్మయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. నర్సమ్మకు ముగ్గురు సంతానం. ఆమె భర్త లచ్చయ్య 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ క్రమంలో నర్సమ్మ తల్లి బాలమణి పేరున ఉన్న 16 గంటల పొలం తన పేరున పట్టా చేయాలని నర్సమ్మ ఒత్తిడి చేసింది.
తాను బ్రతికి ఉన్నంత వరకు ఎవరికి పొలం పట్టా చేసి ఇవ్వనని బాలమణి నిరాకరించింది. దీంతో తల్లిపై కోపం పెంచుకుని నర్సమ్మ పథకం ప్రకారం కన్నతల్లిని నూతనంగా నిర్మిస్తున్న భవనంపైకి తీసుకెళ్లి మద్యం తాగించి కిందకు తోసేసింది. కింద పడి తీవ్ర గాయలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అప్పటికి బాలమణి బ్రతికి ఉండటంతో అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదీ చంపేసింది. మళ్ళీ ఏమి తెలియనట్లు బంగ్లాపై నుండి కిందికి జారి పడిందంటూ 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.
మెదక్ డీఎస్పీ సైదులు ఆదేశాలనుసారం సీఐ పాలవెల్లి, ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి తమదైన శైలిలో నర్సమ్మను విచారణ చేపట్టగా అసలు నిజం బయట పడింది. ఆస్తి కోసం తన తల్లిని హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.