ఈవోకు కరోనా.. దర్శనాలు బంద్
దిశ, మెదక్: ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయ ఈఓ సార శ్రీనివాస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో వారం రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈఓ కరోనా బారిన పడడంతో భక్తుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నేటి నుండి వారం రోజుల పాటు దర్శనాలు బంద్ చేస్తున్నట్లు మెదక్ ఆర్డీఓ సాయిరాం వెల్లడించారు. అమ్మవారికి చేసే పూజలు, అభిషేకాలు, మిగతా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశానికి […]
దిశ, మెదక్: ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయ ఈఓ సార శ్రీనివాస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో వారం రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈఓ కరోనా బారిన పడడంతో భక్తుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నేటి నుండి వారం రోజుల పాటు దర్శనాలు బంద్ చేస్తున్నట్లు మెదక్ ఆర్డీఓ సాయిరాం వెల్లడించారు.
అమ్మవారికి చేసే పూజలు, అభిషేకాలు, మిగతా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశానికి అనుమతి లేదన్నారు. పొడ్చన్ పల్లి పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఏడుపాయలలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆలయ సిబ్బందికి, పూజారులకు కరోనా పరీక్షల అనంతరం వచ్చే ఫలితాలకనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.