నన్ను 'కర్రోడా' అని పిలిచిన వ్యక్తి కాల్ చేశాడు : సామి
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో తాను జాతివివక్ష వ్యాఖ్యలు ఎదుర్కున్నానని వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనను, శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరాను కొంత మంది ‘కర్రోడా’ అని పిలిచేవారని చెప్పాడు. వాళ్లు వెంటనే తనకు క్షమాపణలు చెప్పకుంటే సామాజిక మాధ్యమాల్లో పేర్లు వెల్లడిస్తానని కూడా హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సామి తాజాగా ఒక ట్వీట్ చేశాడు. సన్‌రైజర్స్ తరపున ఆడిన ఒక ఆటగాడు తనకు కాల్ చేసి మాట్లాడాడని చెప్పాడు. […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో తాను జాతివివక్ష వ్యాఖ్యలు ఎదుర్కున్నానని వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనను, శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరాను కొంత మంది ‘కర్రోడా’ అని పిలిచేవారని చెప్పాడు. వాళ్లు వెంటనే తనకు క్షమాపణలు చెప్పకుంటే సామాజిక మాధ్యమాల్లో పేర్లు వెల్లడిస్తానని కూడా హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సామి తాజాగా ఒక ట్వీట్ చేశాడు. సన్‌రైజర్స్ తరపున ఆడిన ఒక ఆటగాడు తనకు కాల్ చేసి మాట్లాడాడని చెప్పాడు. ‘ప్రేమతోనే నేను అలా పిలిచాను తప్ప.. జాతి వివక్ష లేదని అతను వివరణ ఇచ్చాడు. నేను అతడిని నమ్ముతున్నాను.. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇరువురం కృషి చేస్తున్నాం’ అని సామి ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా, సామి సన్ రైజర్స్ టీం తరపున ఆడిన సమయంలో టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. అప్పట్లో ఒక ఇన్‌స్టా పోస్ట్‌లో సామిని ‘కాలూ’ అని సంభోదిస్తూ ఒక పోస్టు కూడా పెట్టాడు. ఇప్పుడు ఇషాంతే కాల్ చేసి ఉంటాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఎందుకంటే ఆప్పట్లో ఇషాంత్ చేసిన పోస్టులో ప్రేమతో పోస్ట్ చేసినట్లే కనపడుతోంది.