హైదరాబాద్ దారిలో నోరు తెరిచిన పురాతన బావి
దిశ, జడ్చర్ల: మిడ్జిల్ మండల కేంద్రం నుంచి వెల్జాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రహదారిపై ప్రమాదభరితంగా పురాతన బావి నోరు తెరుచుకుని కాచుకు కూర్చుంది. గతంలో ఈ మూల మలుపు వద్ద కల్వర్ట్ ఉండేది. నూతన రోడ్డు నిర్మాణంలో భాగంగా.. కాంట్రాక్టర్ పురాతన కల్వర్టును తొలగించి.. నూతన బిటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. కానీ, కల్వర్టు నిర్మాణం చేయకుండా వదిలేశారు. దీంతో మూలమలుపు వద్ద అనేకసార్లు ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి బావిలో పడితే […]
దిశ, జడ్చర్ల: మిడ్జిల్ మండల కేంద్రం నుంచి వెల్జాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రహదారిపై ప్రమాదభరితంగా పురాతన బావి నోరు తెరుచుకుని కాచుకు కూర్చుంది. గతంలో ఈ మూల మలుపు వద్ద కల్వర్ట్ ఉండేది. నూతన రోడ్డు నిర్మాణంలో భాగంగా.. కాంట్రాక్టర్ పురాతన కల్వర్టును తొలగించి.. నూతన బిటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. కానీ, కల్వర్టు నిర్మాణం చేయకుండా వదిలేశారు. దీంతో మూలమలుపు వద్ద అనేకసార్లు ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి బావిలో పడితే పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నూతనంగా కల్వర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.