టైం మేనేజ్మెంట్ సక్రమంగా ఉంటే విజయం వాటంతట అదే వస్తుంది : ప్రదీప్ కుమార్
విద్యార్థి దశలోనే కాకుండా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ లో లక్ష్యసాధనలో
దిశ, మిడ్జిల్ : విద్యార్థి దశలోనే కాకుండా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ లో లక్ష్యసాధనలోను టైం మేనేజ్మెంట్ కీలకమని అది క్రమశిక్షణకు నిబద్ధతకు నిదర్శనమని ప్రముఖ నటుడు రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రదీప్ కుమార్ అన్నారు. సమయం పాటించడం సమర్థవంతంగా మేనేజ్ చేయడం నేర్చుకుంటే ఏ రంగంలో ఉన్న సక్సెస్ వైపు దూసుకు వెళ్తారని అందుకే ఆ సమయపాలన విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాల్సిన గొప్ప నైపుణ్యం టైం మేనేజ్మెంట్ అని తెలిపారు.శనివారం మిడ్జిల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలల 9 .10 వ తరగతి విద్యార్థులకు నటుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు కె.వి ప్రదీప్ కుమార్ చేత వ్యక్తిత్వ వికాసం విద్య అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టి జ్యోతి అల్వాల్ రెడ్డి స్థానిక ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యుల తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కె.వి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో గొప్పగా స్థిరపడాలంటే ఉన్నతమైన లక్ష్యం అవసరమని దానికోసం ప్రతి అడుగు ముఖ్యమైనదని ప్రతి విద్యార్థి ఏ దిశగా ప్రయాణించి ఎలా చదివితే గమ్యాన్ని చేరుకుంటాడో తెలియక సందిగ్ధతతో సతమతమవుతూ ఉంటారని వారికి అవగాహన కల్పించడం కోసమే నేడు మిడ్జిల్ మండల కేంద్రంలోని చేయూత స్వచ్ఛంద సంస్థ వారు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి సమయపాలన పాటిస్తూ పరీక్షల సమయంలో ఒత్తిడిని దరిచేరకుండా ప్రశాంతత మైండ్ సెట్ తో పరీక్షలకు హాజరై విజయం సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఓ ప్రవీణ్ కుమార్ బాదేపల్లి మార్కెట్ చైర్మన్ జ్యోతి స్థానిక తహసీల్దార్ పీవీ రాజు ఎస్సై శివ నాగేశ్వర నాయుడు ఎంపీడీవో గీతాంజలి మండల విద్యాధికారి సుధాకర్ మండల వైద్యాధికారి శివ కాంత్ చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ కె వెంకటరెడ్డి కార్యదర్శులు అశోక్ కుమార్, భీమ్రాజ్ కోశాధికారి రాఘవేందర్ రెడ్డి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు మండల యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.