అధికారుల నిర్లక్ష్యం.. భారీ వర్షాల వేళ పొంచి ఉన్న ప్రమాదం
దిశ, అశ్వారావుపేట : గులాబ్ తుఫాన్ కారణంగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నియోజకవర్గంలో ఉన్న చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న పేరంటాల చెరువు అలుగు కాలువ కట్టకు భారీ వర్షాల కారణంగా ప్రమాదం పొంచిఉంది. గత ఏడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు పేరంటాల చెరువు అలుగు కట్ట తెగి సుమారు 250 ఎకరాలకుపైగా పంట పొలాలు నీట మునిగి రైతులు […]
దిశ, అశ్వారావుపేట : గులాబ్ తుఫాన్ కారణంగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నియోజకవర్గంలో ఉన్న చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న పేరంటాల చెరువు అలుగు కాలువ కట్టకు భారీ వర్షాల కారణంగా ప్రమాదం పొంచిఉంది.
గత ఏడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు పేరంటాల చెరువు అలుగు కట్ట తెగి సుమారు 250 ఎకరాలకుపైగా పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు మాత్రం నామమాత్రంగా గ్రావెల్ మట్టిపోసి.. కట్ట తిరిగి నిర్మించారు. కానీ, కట్ట బలంగా ఉండటానికి గోడ నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఇసుక.. బస్తాలలో నింపి, ఆ కట్టకు పేర్చారు, ఇసుక బస్తాలు ఎండకు ఎండి.. వానకు తడిసి బస్తాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు పేరంటాల చెరువులోకి వస్తుండటంతో చెరువు అలుగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. అయితే మరోసారి కాలువ కట్ట తెగే ప్రమాదం ఉందని చెరువు కింద సాగుచేస్తున్న రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రానున్న రోజుల్లోనైనా కట్ట బలంగా ఉండేందుకు సైడ్ వాల్ నిర్మించాలని కోరుతున్నారు.