‘కేసీఆర్ గారూ.. దళితులు చావు డప్పుకొట్టేందుకు రావట్లేదు.. అంతా మీవల్లే’.. (వీడియో)
దిశ ప్రతినిధి, వరంగల్ : దళిత బంధు పథకం అమలు చేస్తుండటంతో దళితులు చావు డప్పుకొట్టేందుకు కూడా రావడం లేదంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. తన అక్క చనిపోతే డప్పు కొట్టేందుకు వస్తామని చెప్పి… చివరికి నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. కాష్టం పేర్చేందుకు కూడా ఎవరూ రాలేదు చూడండి అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. దళిత బంధు ఎవరికి ఇస్తున్నారో..? ఎందుకు ఇస్తున్నారో..? అర్థం చేసుకుని ఇవ్వాలంటూనే […]
దిశ ప్రతినిధి, వరంగల్ : దళిత బంధు పథకం అమలు చేస్తుండటంతో దళితులు చావు డప్పుకొట్టేందుకు కూడా రావడం లేదంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. తన అక్క చనిపోతే డప్పు కొట్టేందుకు వస్తామని చెప్పి… చివరికి నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. కాష్టం పేర్చేందుకు కూడా ఎవరూ రాలేదు చూడండి అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. దళిత బంధు ఎవరికి ఇస్తున్నారో..? ఎందుకు ఇస్తున్నారో..? అర్థం చేసుకుని ఇవ్వాలంటూనే కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఈ వీడియో పెట్టిన వ్యక్తిపై దళిత సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు. దళితులంటే డప్పు కొట్టడానికే ఉన్నవారిగా సదరు వ్యక్తి వీడియో మాట్లాడినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులు డప్పు కొట్టడానికే లేరని ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది…? వీడియో పోస్టు చేసిన వ్యక్తి ఎవరు,..? అనేది తెలియాల్సి ఉంది. ఈ సెల్ఫీ వీడియో పోస్టు చేసిన వ్యక్తి ఊరు, పేరు వివరాలు అందులో పేర్కొనకపోవడం గమనార్హం.