1986లోనే దళితబంధుకు బీజం పడింది: సీఎం కేసీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో : దళితబంధు పథకాన్ని హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకొచ్చామని ప్రతి ఒక్కరూ అంటున్నారని, కానీ దీనికి బీజం 1986లోనే పురుడు పోసుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘దళితబంధు’పై మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దళితుల కోసం గత ప్రభుత్వాలు కొంత చేశాయి కానీ వారి అభివృద్ధి జరగలేదని, దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదన్నారు. రాష్ట్రాల్లో భిన్నమైన […]
దిశ, డైనమిక్ బ్యూరో : దళితబంధు పథకాన్ని హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకొచ్చామని ప్రతి ఒక్కరూ అంటున్నారని, కానీ దీనికి బీజం 1986లోనే పురుడు పోసుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘దళితబంధు’పై మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దళితుల కోసం గత ప్రభుత్వాలు కొంత చేశాయి కానీ వారి అభివృద్ధి జరగలేదని, దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదన్నారు.
రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా.. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారని, రాష్ట్రంలో 75 లక్షలమంది దళితులు ఉంటే కేవలం 13 లక్షల ఎకరాల భూములే ఉన్నాయన్నారు. ఇలాంటి పనుల వల్ల దళితుల్లో అంతగా మార్పులు రాలేదన్నారు.