దళితుల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టాడు

దిశ, సూర్యాపేట: దళితులు ఐక్య పోరాటాల ద్వారా అభివృద్ధి చెందుతారని, వారి ఐక్యతే అభివృద్ధికి మూలం అని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు అమరవీరులకు ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… దళితుల మధ్య విభేదాలు సృష్టించి దళితులను అభివృద్ధికి, అధికారానికి దూరంగా చేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ […]

Update: 2020-08-11 05:44 GMT

దిశ, సూర్యాపేట: దళితులు ఐక్య పోరాటాల ద్వారా అభివృద్ధి చెందుతారని, వారి ఐక్యతే అభివృద్ధికి మూలం అని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు అమరవీరులకు ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… దళితుల మధ్య విభేదాలు సృష్టించి దళితులను అభివృద్ధికి, అధికారానికి దూరంగా చేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తూ తన స్వార్థం కోసం, రాజకీయ అస్తిత్వం కోసం ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వదిలేసి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే విధంగా, ఐక్య పోరాటాలు చేసి హక్కులను సాధించుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..