Sri Rama Navami-2025:భద్రాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. APSRTC కీలక ప్రకటన
శ్రీరామనవమి పండగను అనంత కోటి భక్త జనం సీతారామచంద్ర మూర్తి ని స్మరిస్తూ అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
దిశ,వెబ్‌డెస్క్: శ్రీరామనవమి(Sri Ram Navami) పండగను అనంత కోటి భక్త జనం సీతారామచంద్ర మూర్తి ని స్మరిస్తూ అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ క్రమంలో రేపు(ఏప్రిల్ 6) రాములోరి పండుగను జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ఇప్పటికే రామయ్య కల్యాణానికి ఊరూర మండపాలు ముస్తాబయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణలోని భద్రాచలం అంగరంగ వైభవంగా ముస్తాబైంది.
భద్రాచలం(Bhadrachalam) రాములోరి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు(Devotees) భారీగా తరలి వెళ్తుంటారు. ఈ క్రమంలో భక్తులతో బస్‌స్టండ్‌లలో రద్దీ నెలకొంది. ఈ తరుణంలో APSRTC కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. రాజమండ్రి(Rajahmundry) డిపో నుంచి భద్రాచలానికి 8 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బస్సులు శనివారం ఇక్కడి బస్టాండ్ నుంచి బయలుదేరుతాయి.
టైమింగ్స్ ఇలా..
మధ్యాహ్నం 12.15 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సు చొప్పున వెళతాయని రాజమండ్రి ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్.కె.షబ్నం తెలిపారు. ఆదివారం భద్రచాలం సీతారాముల కళ్యాణోత్సవం ముగిసిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి బయలుదేరి రాజమండ్రికి చేరుకుంటుంది. రాజమండ్రి-భద్రాచలం మధ్య నడిచే బస్సుల టికెట్ల కోసం www.apsrtconline.in వెబ్‌సైట్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చు