మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి.. ‘దళితబంధు’ డబ్బులు జమ

దిశ, యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా వాసాలమర్రి గ్రామంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉండగా, 66 కుటుంబాలకు గురువారం వారి అకౌంట్లలో డబ్బులు జమ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారి ఫోన్‌లకు మెసేజ్‌లు వచ్చినట్లు […]

Update: 2021-09-09 06:39 GMT

దిశ, యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా వాసాలమర్రి గ్రామంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉండగా, 66 కుటుంబాలకు గురువారం వారి అకౌంట్లలో డబ్బులు జమ అయినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు వారి ఫోన్‌లకు మెసేజ్‌లు వచ్చినట్లు సమాచారం. డబ్బులు జమ కావడంతో దళితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమాజంలో తమను గౌరవంగా బతికేలా చేస్తోన్న ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అంతేగాకుండా.. డబ్బులను వృథా చేయకుండా బిజినెస్‌లు చేసేందుకు పలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఫౌల్ట్రీ, డైరీ ఫామ్‌లను సందర్శిస్తున్నట్లు వాసాలమర్రి దళితులు చెబుతున్నారు.

Tags:    

Similar News