టీజేఎస్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
దిశ, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో రాంనగర్‌లో బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. టీజేఎస్ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో రాంనగర్ మీసేవ వద్ద, ఆస్థాన పార్క్ వద్ద జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు బియ్యం నిత్యావసర వస్తువులను.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులకు బియ్యం, కూరగాయలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఎస్ నగర కమిటీ అధ్యక్షులు ఎం.నర్సయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]
దిశ, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో రాంనగర్‌లో బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. టీజేఎస్ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో రాంనగర్ మీసేవ వద్ద, ఆస్థాన పార్క్ వద్ద జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు బియ్యం నిత్యావసర వస్తువులను.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులకు బియ్యం, కూరగాయలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఎస్ నగర కమిటీ అధ్యక్షులు ఎం.నర్సయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అందిస్తున్న సాయం పేద ప్రజలకు సరిపోవడం లేదని, ఎంతో మంది పేదలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5 వేల రూపాయలు నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నాయకులు జైపాల్ రెడ్డి, ఎం సురేష్, సింధం రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags: corona effect, rice distribution, tjs hyderabad city, m narasaiah