గ్యాస్ సిలిం‘డర్’.. ఇలా తీసుకోండి!
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతున్నది. ఇంతటి భయంకర భూతాన్ని మట్టుబెట్టేందుకు ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బారిన పడకుండా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. అందులో భాగంగా ముఖాలకు మాస్కులు , చేతులకు గ్లౌజులు వాడుతున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్స్ తో శుభ్రపరుచుకుంటున్నారు. తాము వాడుతున్న వస్తువులను […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతున్నది. ఇంతటి భయంకర భూతాన్ని మట్టుబెట్టేందుకు ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బారిన పడకుండా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. అందులో భాగంగా ముఖాలకు మాస్కులు , చేతులకు గ్లౌజులు వాడుతున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్స్ తో శుభ్రపరుచుకుంటున్నారు. తాము వాడుతున్న వస్తువులను సైతం శుభ్రపరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు నిత్యవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఏజెన్సీలు సూచిస్తున్నట్లు సమాచారం. సిలిండర్ ను సరఫరా చేసేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు పాటించాలని వారు చెబుతున్నట్లు సమాచారం. అవేమిటంటే.. సిలిండర్ ను తామే వినియోగదారుల ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇస్తామని, ఆ సమయంలో సామాజిక దూరం పాటించాలని, తమకు అందిచే ఖాళీ సిలిండర్ ను వినియోగదారులు తమకు ఇచ్చేటప్పుడు మొదటగా దానిని సబ్బు లేదా ఇతర రసాయనాలతో కడిగి.. ఆ తర్వాత దానిని ఎండలో ఆరబెట్టి ఇవ్వాలని తమకు ఇవ్వాలని వారు పేర్కొంటున్నట్లు సమాచారం.
Tags : Gas cylinders, social distance, corona effect, supply at home