ఇంటర్నెట్ వేదికలపై భద్రతా చిట్కాలు పాటించాలి
దిశ, క్రైమ్‌బ్యూరో: వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర వేదికలపై మహిళలు పూర్తిస్థాయి భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ సూచించారు. ఆదివారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సమక్షంలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు- పరిష్కారాలు, ఆన్‌లైన్ బ్లాక్ మెయిలింగ్, సైబర్ నేరాలు, సైబర్ బెదిరింపు, సైబర్ స్టాకింగ్‌పై వర్చువల్ వెబ్‌నార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ మాట్లాడుతూ మహిళలు నివాసం ఉంటున్న, పనిచేస్తున్న పరిసరాల్లో నిరంతరం అప్రమత్తంగా […]
దిశ, క్రైమ్‌బ్యూరో: వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర వేదికలపై మహిళలు పూర్తిస్థాయి భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ సూచించారు. ఆదివారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సమక్షంలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు- పరిష్కారాలు, ఆన్‌లైన్ బ్లాక్ మెయిలింగ్, సైబర్ నేరాలు, సైబర్ బెదిరింపు, సైబర్ స్టాకింగ్‌పై వర్చువల్ వెబ్‌నార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ మాట్లాడుతూ మహిళలు నివాసం ఉంటున్న, పనిచేస్తున్న పరిసరాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యధికంగా పరిచయస్తులే వేధింపులు చేస్తారన్నారు. ముఖ్యంగా స్నేహితులు, స్నేహం నుంచి విడిపోయిన వారు, గతంలో మనతో మంచి సంబంధాలు నెలకొల్పి ప్రస్తుతం దూరమైన వారు, విడాకులు పొందిన జీవిత భాగస్వాములు, పని ప్రదేశంలో సహచరులు, పొరుగువారు తదితర వ్యక్తుల నుంచి వేధింపులు వస్తాయన్నారు. వ్యక్తిగతంగా ఉండాల్సిన పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని ఒకవేళ అనుకోకుండా షేర్ చేసినట్టయితే వెంటనే మార్చుకోవాలన్నారు.