Alert : అలసటగా ఉంటే బండి నడపకండి : సైబరాబాద్ పోలీస్

దిశ, వెబ్‌డెస్క్: అతివేగం ప్రమాదకరం.. హెల్మెట్‌ లేని ప్రయాణం చేయొద్దు అని ఎంత ప్రచారం చేసినా కొందరు పట్టించుకోరు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులతో పాటు కుటుంబసభ్యులు సైతం ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా వాహనం నడపాలని సూచనలు చేస్తుంటారు. మన జీవితాలపై కుటుంబం ఆధారపడి ఉంటుందని, ఏదైనా జరగకూడనిది జరిగితే కుటుంబం రోడ్డునపడే అవకాశం ఉంటుందని, పోలీసులు ఎంత వివరించి చెప్పినా కొందరు మత్రం […]

Update: 2021-07-21 22:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: అతివేగం ప్రమాదకరం.. హెల్మెట్‌ లేని ప్రయాణం చేయొద్దు అని ఎంత ప్రచారం చేసినా కొందరు పట్టించుకోరు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులతో పాటు కుటుంబసభ్యులు సైతం ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా వాహనం నడపాలని సూచనలు చేస్తుంటారు. మన జీవితాలపై కుటుంబం ఆధారపడి ఉంటుందని, ఏదైనా జరగకూడనిది జరిగితే కుటుంబం రోడ్డునపడే అవకాశం ఉంటుందని, పోలీసులు ఎంత వివరించి చెప్పినా కొందరు మత్రం అస్సలు వినటం లేదు. తాజాగా.. ఈ నిర్లక్ష్యమే ఒకరి ప్రాణాలు తీసింది.

ఇటీవల.. హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి నిద్రపోతూ వాహనం నడిపి, ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘నిద్రలేక పోవడం, అలసటగా ఉంటే బండి నడపకండి. రాత్రంతా లారీ డ్రైవింగ్ చేసి, తగినంత విశ్రాంతి తీసుకోకుండా బైక్ నడుపుతూ ఓ వ్యక్తి కింద పడి చనిపోయాడు.’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News