అంతర్‌ రాష్ట్ర దొంగ అరెస్ట్

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఏపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన అబ్బూరి సోమయ్య.. తాను వ్యాపారినని, తనపేరు శ్రీకాంత్ చౌదరి, అక్కినేని కార్తీక్‌‌గా చెప్పుకుంటూ పలువురి మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. వారికి బహుమతులు అందజేస్తూ సన్నిహితంగా ఉంటూ ఖరీదైన హోటళ్లలో బస చేసేవాడు. ఈ సమయంలో హోటళ్లకు వచ్చిన మహిళల ఆభరణాలు, హోటళ్లలో బస చేసే వారి ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లను ఎత్తుకెళ్లేవాడు. […]

Update: 2020-10-06 10:36 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఏపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన అబ్బూరి సోమయ్య.. తాను వ్యాపారినని, తనపేరు శ్రీకాంత్ చౌదరి, అక్కినేని కార్తీక్‌‌గా చెప్పుకుంటూ పలువురి మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. వారికి బహుమతులు అందజేస్తూ సన్నిహితంగా ఉంటూ ఖరీదైన హోటళ్లలో బస చేసేవాడు. ఈ సమయంలో హోటళ్లకు వచ్చిన మహిళల ఆభరణాలు, హోటళ్లలో బస చేసే వారి ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లను ఎత్తుకెళ్లేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపాడు. ఈ క్రమంలోనే పక్కా సమాచారం తెలుసుకున్న మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 260 గ్రాముల బంగారం, 5కిలోల వెండి, 3 కెమెరాలు, 2ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా రూ.36 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో సుమారు 70 కి పైగా కేసుల్లో ఉన్నట్టు సీపీ సజ్జనార్ తెలిపారు.

Tags:    

Similar News