వీధి శునకాల ఆకలి తీర్చనున్న సైబరాబాద్ పోలీసులు
దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి మనుషులనే కాదు మూగ జీవాలను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నది. లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు, దుకాణాలు మూతపడటంతో వీధి కుక్కలు ఆకలికి అలమటిస్తున్నాయి. దీంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాటి కడుపు నింపేందుకు ముందుకు వచ్చాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వచ్ఛంద సంస్థలే మూగ జీవాలకు ఆహారం అందజేస్తున్నాయి. అయితే మన భాగ్యనగరంలోని వీధి శునకాల ఆకలి తీర్చేందుకు సైబరాబాద్ పోలీసులు, వివిధ యానిమల్ వెల్ ఫేర్ ఆర్గనైజేషన్స్ […]
దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి మనుషులనే కాదు మూగ జీవాలను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నది. లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు, దుకాణాలు మూతపడటంతో వీధి కుక్కలు ఆకలికి అలమటిస్తున్నాయి. దీంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాటి కడుపు నింపేందుకు ముందుకు వచ్చాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వచ్ఛంద సంస్థలే మూగ జీవాలకు ఆహారం అందజేస్తున్నాయి. అయితే మన భాగ్యనగరంలోని వీధి శునకాల ఆకలి తీర్చేందుకు సైబరాబాద్ పోలీసులు, వివిధ యానిమల్ వెల్ ఫేర్ ఆర్గనైజేషన్స్ తో కలిసి ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మొత్తంగా సైబరాబాద్ పరిధిలోని 1500 వీధి కుక్కలకు వాళ్లు ఆహారం అందించబోతున్నారు. అంతేకాదు వేసవి కావడంతో… నీళ్లు లేక మూగ జీవాలు దాహంతో అలమటించిపోతున్నాయి. వాటి దాహం తీర్చేందుకు కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 300 కు పైగా కుండల్ని ఏర్పాటు చేశారు. ‘ఆహారం లేక, నీళ్లు దొరక్క వీధి శునకాలు చాలా వింతగా, అగ్రెసివ్ గా ప్రవర్తిస్తున్నాయి. మానవతా హృదయంతో మనం ఏ విధంగానైతే పేదలకు, అన్నార్తులకు ఆహారం దానం చేస్తున్నామో, అదే ప్రేమ, వాత్సల్యాన్ని మూగజీవాలపైన చూపించాలి. వీధి శునకాలకు ఆహారం, నీళ్లు అందించడానికి 100 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు’ అని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
tags :corona virus, lockdown, street dogs, food, hungry, intiative, cyberabad police