'వాహనపూజ చేయండి.. కానీ అలా చేయకండి'… వాహనదారులకు పోలీసుల హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: దసరా సందర్భంగా వాహనాలకు, ఆయుధాలకు పూజలు చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వాహనాలకు గంధం రాసి పూల దండలతో అలంకరిస్తుంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే పూజల పేరుతో నెంబర్ ప్లేట్ ని మూసి వేయడం సరికాదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వాహనదారులను ఉద్దేశించి సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ఫొటోని యాడ్ చేసి “ఆయుధ పూజ బండికి చేయండి. నెంబర్ ప్లేట్ కు కాదు.” అని పోస్ట్ […]
దిశ, డైనమిక్ బ్యూరో: దసరా సందర్భంగా వాహనాలకు, ఆయుధాలకు పూజలు చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వాహనాలకు గంధం రాసి పూల దండలతో అలంకరిస్తుంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే పూజల పేరుతో నెంబర్ ప్లేట్ ని మూసి వేయడం సరికాదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వాహనదారులను ఉద్దేశించి సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ఫొటోని యాడ్ చేసి “ఆయుధ పూజ బండికి చేయండి. నెంబర్ ప్లేట్ కు కాదు.” అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సందర్భానుసారంగా ఇలా వాహనదారులను అలర్ట్ చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆయుధ పూజ బండికి చేయండి. నెంబర్ ప్లేట్ కు కాదు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/333Xoy5nCI
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) October 16, 2021