డాక్టర్ కిడ్నాప్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఎంట్రీతో..
దిశ, వెబ్‌డెస్క్: రాజేంద్రనగర్‌లో డెంటిస్ట్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన ఆయన.. కిడ్నాప్ జరిగిన 12 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ముస్తఫాతో పాటు మరో నలుగరు బుర్కా ధరించి హుస్సేన్‌ను కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. కిడ్నాప్ చేసిన వెంటనే డాక్టర్‌ను ముందుగా కూకట్‌పల్లి తరలించారని.. కూకట్‌పల్లి నుంచి బెంగళూరు తీసుకెళ్లేందుకు మరో టీంను […]
దిశ, వెబ్‌డెస్క్: రాజేంద్రనగర్‌లో డెంటిస్ట్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన ఆయన.. కిడ్నాప్ జరిగిన 12 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ముస్తఫాతో పాటు మరో నలుగరు బుర్కా ధరించి హుస్సేన్‌ను కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. కిడ్నాప్ చేసిన వెంటనే డాక్టర్‌ను ముందుగా కూకట్‌పల్లి తరలించారని.. కూకట్‌పల్లి నుంచి బెంగళూరు తీసుకెళ్లేందుకు మరో టీంను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇదే సమయంలో హుస్సేన్ కుటుంబానికి కాల్ చేసి రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్టు నిందితులు విచారణలో వెల్లడించారన్నారు. ఈ కేసు చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు… ఏపీ పోలీసుల సహాయంతో కేవలం 12 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి డాక్టర్ హుస్సేన్‌ను రక్షించినట్టు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.