అసలు 'మా' లో ఏం జరుగుతోంది.. నిన్న బండ్ల.. నేడు సీవీఎల్
దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించి సంచలనం రేకెత్తించగా.. తాజాగా మరో నటుడు ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికల అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లు నామినేషన్ కూడా వేసిన సీవీఎల్ నరసింహారావు తాజాగా తాను […]
దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించి సంచలనం రేకెత్తించగా.. తాజాగా మరో నటుడు ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికల అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లు నామినేషన్ కూడా వేసిన సీవీఎల్ నరసింహారావు తాజాగా తాను పోటీ నుంచి తప్పుకొంటునట్లు తెలిపారు.
తన నామినేషన్ ను వెనక్కి తీసుకుంటున్నానని, ‘మా’ పదవుల కంటే ‘మా’ సభ్యుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని సీవీఎల్ పేర్కొన్నారు. నామినేషన్ వేసి, మ్యానిఫెస్టో ని కూడా విడుదల చేసిన తరువాత ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. నిన్నటికి నిన్న బండ్ల కూడా నామినేషన్ ని వెనక్కి తీసుకొంటున్నట్లు ప్రకటించాడు. తన మద్దతు ప్రకాశ్ రాజ్ కి ఉంటుందని తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం రెండు పోటీలు హోరాహోరీగా పోటీలో నిలబడనున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య రణరంగమే జరుగుతోంది. రెండు ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వేడెక్కిస్తున్నాయి.