రసవత్తర పోరు.. ‘మా’ ఎన్నికల బరిలో సీనియర్ నటుడు
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ఇప్పటికే ‘మా’ ఎన్నికల బరిలో పలువురు ముఖ్య నటులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నటుడు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, నటీ జీవిత, హేమలు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ప్యానల్ సభ్యుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో సీనియర్ నటుడు చేరిపోయారు. తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు నరసింహారావు ఈ ఏడాది ‘మా’ […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ఇప్పటికే ‘మా’ ఎన్నికల బరిలో పలువురు ముఖ్య నటులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నటుడు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, నటీ జీవిత, హేమలు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ప్యానల్ సభ్యుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో సీనియర్ నటుడు చేరిపోయారు.
తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు నరసింహారావు ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సీవీఎల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను అన్నివిధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని అన్నారు. త్వరలోనే తన ప్యానెల్ అభ్యర్థులను ప్రకటిస్తానని తెలిపారు.