పండుగ పూట బంగారం కొంటున్నారా..? ఇది మరిస్తే మోసపోయినట్టే!
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ఏ చిన్న శుభకార్యమైన, పండుగలు వచ్చినా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. డబ్బులు ఉన్న వారు తమ స్థాయికి అనుగుణంగా కొలుగోలు చేస్తే, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎంతో కొంత బంగారం అయితే చాలు అని తీసుకుంటుంటారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశి, పండుగల సమయంలో పసిడి కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని ఇండియన్స్ భావిస్తుంటారు. కొందరు బంగారాన్ని లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా కూడా చూస్తారు. అందుకే […]
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ఏ చిన్న శుభకార్యమైన, పండుగలు వచ్చినా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. డబ్బులు ఉన్న వారు తమ స్థాయికి అనుగుణంగా కొలుగోలు చేస్తే, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎంతో కొంత బంగారం అయితే చాలు అని తీసుకుంటుంటారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశి, పండుగల సమయంలో పసిడి కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని ఇండియన్స్ భావిస్తుంటారు.
కొందరు బంగారాన్ని లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా కూడా చూస్తారు. అందుకే బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కూడా భారతీయ మహిళలు మంచి రోజులను చూస్తారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశి నాడు పసిడి తీసుకుంటే ధనలాభం కలుగుతుందని వారి నమ్మకం. వ్యాపారులు కూడా వీరి సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పండుగల సమయంలో మహిళలు బంగారం కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతారని తెలుస్తోంది.
అయితే, బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. షాపులోకి వెళ్లి నచ్చింది కాదా అని ఏ ఐటం పడితే అది తీసుకోవడం, మెరుస్తుంది కదా ఇదే నిజమైన బంగారం అని కొనుగోలు చేస్తే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సార్లు అసలు బంగారానికి బదులు నకిలీది తీసుకుని మోసపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇటువంటి మోసాలు దేశంలో చాలా వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే భారతప్రభుత్వం హాల్‌మార్క్ లోగో ఉన్న బంగారం లేదా నగలను మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టింది.
హాల్‌మార్క్ లోగో ఉంటే భారత ప్రభుత్వం చేత సర్టిఫైడ్ చేయబడిన క్వాలిటీ బంగారం. అదేవిధంగా BIS నమోదిత విక్రయదారుల వద్ద బంగారం కొనుగోళ్లు చేస్తే కస్టమర్లు సేఫ్ జోన్‌లో ఉంటారని కేంద్రం సూచించింది. పసిడి తీసుకునే సమయంలో హాల్‌మార్క్ గుర్తు కనిపించకపోతే అది నకిలీ బంగారం లేదా నాసిరకం అని గుర్తుపెట్టుకోవాలని తెలిపింది. ఈ ఏడాది జూన్ 23 నుంచి దేశంలోని 256 జిల్లాల్లో హాల్‌మార్క్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇటువంటి బంగారాన్ని తిరిగి మార్కెట్లో విక్రయించినా తరుగు పోను మంచి ధర పలుకుతుంది.