‘రైనా విషయం ధోని చూసుకోవాలి’

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ (csk) జట్టుతో పాటు యూఏఈ వెళ్లిన సురేష్ రైనా అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో ఇండియాకు తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తొలుత గుర్రుగా ఉన్న సీఎస్కే యజమాని ఎన్. శ్రీనివాసన్ తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు. సురేష్ రైనా తనకు ఒక కొడుకు లాంటి వాడని, కానీ ఇప్పుడు అతడు జట్టులోకి తిరిగి రావడం అనే విషయం తన చేతిలో లేదని అన్నారు. ఇండియాకు తిరిగొచ్చిన […]

Update: 2020-09-02 11:40 GMT

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ (csk) జట్టుతో పాటు యూఏఈ వెళ్లిన సురేష్ రైనా అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో ఇండియాకు తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తొలుత గుర్రుగా ఉన్న సీఎస్కే యజమాని ఎన్. శ్రీనివాసన్ తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు. సురేష్ రైనా తనకు ఒక కొడుకు లాంటి వాడని, కానీ ఇప్పుడు అతడు జట్టులోకి తిరిగి రావడం అనే విషయం తన చేతిలో లేదని అన్నారు. ఇండియాకు తిరిగొచ్చిన రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌ తనకు తండ్రిలాంటి వారని, తననెప్పుడూ ఆయన చిన్న కొడుకులా చూసుకొనేవారని అన్నాడు. రైనా వ్యాఖ్యలకే శ్రీనివాసన్ స్పందించారు.

‘రైనా చెప్పింది నిజమే. అతడిని సొంత కొడుకులా చూసుకున్నాను. సీఎస్కే (csk) విజయాలకు అతడు ఎంతో కష్టపడ్డాడు. అతడు మాకెంతో ప్రధానమైన ఆటగాడు. నేను ఎప్పుడూ క్రికెటర్ల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చను. చెన్నై టీమ్ మాత్రమే మాది. అందులోని ఆటగాళ్లు మా ఆస్తి కాదు. వారి నిర్ణయాలు వాళ్లు తీసుకున్నారు. మా జట్టుకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. ఆయన మీదే భారం వేశాము. ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలను కెప్టెనే చూసుకోవాలి. ఇప్పుడు రైనా జట్టులోకి రావడం అనేది నా చేతిలో లేదు’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. రైనా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. రైనా తిరిగి జట్టులోకి రావడం ధోనీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఆయన వెల్లడించడంతో. ఇప్పుడు అందరి దృష్టి ధోనిపై పడింది.

Tags:    

Similar News