పేసర్ కోసం సీఎస్కే వేట

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టకు పేసర్ హాజెల్‌వుడ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబంతో కలసి ఉండేందుకు ఐపీఎల్ ఆడబోవడం లేదని యాజమాన్యానికి తెలిపాడు. కేవలం నాలుగు రోజుల గడువే ఉండటంతో సీఎస్కే కొత్త బౌలర్‌ను వెతికే పనిలో పడింది. అతడి స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ బిల్లీ స్టాన్‌లేక్ లేదా ఇంగ్లాండ్ బౌలర్ రీస్ టోప్లేను తీసుకోవాలని భావించి వారితో సంప్రదింపులు జరిపింది. కాగా, తాము […]

Update: 2021-04-04 09:34 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టకు పేసర్ హాజెల్‌వుడ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబంతో కలసి ఉండేందుకు ఐపీఎల్ ఆడబోవడం లేదని యాజమాన్యానికి తెలిపాడు. కేవలం నాలుగు రోజుల గడువే ఉండటంతో సీఎస్కే కొత్త బౌలర్‌ను వెతికే పనిలో పడింది. అతడి స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ బిల్లీ స్టాన్‌లేక్ లేదా ఇంగ్లాండ్ బౌలర్ రీస్ టోప్లేను తీసుకోవాలని భావించి వారితో సంప్రదింపులు జరిపింది.

కాగా, తాము సీఎస్కే జట్టుకు ఆడలేమని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. సీఎస్కే జట్టుకే కాదు ఈ సీజన్‌లో ఐపీఎల్ ఆడటానికి తాను ఆసక్తి చూపించలేదని చెప్పారు. ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతుండమే దీనికి కారణమని చెబుతున్నారు. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్ రీస్ టోప్లే ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్-ఇండియా సిరీస్‌లో ఆడాడు. మొన్నటి వరకు బయోబబుల్‌లో గడిపిన అతడు మరోసారి బయోబబుల్‌లో ఉండటానికి ఇష్ట పడటం లేదని సమాచారం, అందుకే సీఎస్కే ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తున్నది. ఇంకా ఎవరైనా పేసర్ అందుబాటులో ఉన్నాడా అని సీఎస్కే వేట కొనసాగిస్తున్నది.

Tags:    

Similar News