రైనాకు జట్టులో స్థానం లేదు : సీఎస్కే
దిశ, స్పోర్ట్స్ : తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చేతులెత్తేసింది. అంబటి రాయుడు, సురేష్ రైనా లేక పోవడం వల్ల బ్యాటింగ్ బలహీనంగా మారిందని కోచ్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు. కాగా, రాయుడు వస్తే బ్యాటింగ్ లైనప్ బలంగా మారుతుందని ధోని అన్నాడు. కాగా, రైనాను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే అభిమానులు పట్టుబడుతున్నారు. ‘కమ్ బ్యాక్ మిస్టర్ ఐపీఎల్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో […]
దిశ, స్పోర్ట్స్ : తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చేతులెత్తేసింది. అంబటి రాయుడు, సురేష్ రైనా లేక పోవడం వల్ల బ్యాటింగ్ బలహీనంగా మారిందని కోచ్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు. కాగా, రాయుడు వస్తే బ్యాటింగ్ లైనప్ బలంగా మారుతుందని ధోని అన్నాడు. కాగా, రైనాను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే అభిమానులు పట్టుబడుతున్నారు.
‘కమ్ బ్యాక్ మిస్టర్ ఐపీఎల్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని అనుకోవడం సురేష్ రైనా వ్యక్తిగత నిర్ణయం అని, అతని నిర్ణయాన్ని గౌరవిస్తామని అన్నారు. ప్రస్తుతం మా టీమ్ పూర్తిగా నిండిపోయింది, రైనాకు జట్టులో స్థానం కూడా లేదు అని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. రాబోయే మ్యాచ్‌లలో సీఎస్కే పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.