తిరుమలగిరిలో ఎంజాయ్‌మెంట్​సర్వే : CS ఆర్డర్

దిశ, తెలంగాణ బ్యూరో : నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​గురువారం ఆదేశించారు. సీఎం కేసీఆర్ నల్లగొండ పర్యటన సందర్భంగా తిరుమలగిరి మండలంలోని 5 గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈమేరకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్ […]

Update: 2021-02-11 11:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​గురువారం ఆదేశించారు. సీఎం కేసీఆర్ నల్లగొండ పర్యటన సందర్భంగా తిరుమలగిరి మండలంలోని 5 గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈమేరకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఐఆర్ఎస్​ఎండీ వెంకటేశ్వరరావు, సీసీఎల్‌ఏ స్పెషల్ ఆఫీసర్ సత్యశారదలతో సమావేశం నిర్వహించారు.

నెల్లికల్, చింతలపాలెం, తునికినూతల, జమ్మన్నకోట, ఎల్లాపురం(సుంకిషాల తండా) గ్రామాల్లో 3,495 ఎకరాల భూమికి సంబంధించి ఎంజాయ్‌మెంట్​సర్వేను వెంటనే చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. డ్రాఫ్ట్​లిస్ట్‌ను పబ్లిష్​చేసి అభ్యంతరాలుంటే, వెంటనే పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత అర్హులైన ల్యాండ్ హోల్డర్లకు పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తామన్నారు. ఈ మొత్తం ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీని వల్ల 1,700 మంది పేద రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

Tags:    

Similar News